Shocking: ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దన్నారని.. 9వ అంతస్తు నుంచి దూకి ముగ్గురు బాలికలు ఆత్మహత్య

Shocking: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ నగరాన్ని కుదిపేసే హృదయవిదూరక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నగర పరిధిలోని భారత్‌ సిటీ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో 9వ అంతస్తు నుంచి దూకి ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు మృతులను పాఖి (12), ప్రాచి (14), విషిక (16)గా గుర్తించారు. చిన్న వయసులోనే ముగ్గురు చెల్లెల్లు ఈ విధంగా ప్రాణాలు విడిచిపెట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్థానికుల కథనం ప్రకారం.. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు చిన్ననాటి నుంచే ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. స్నానం చేయడం నుంచి...