Shocking: నంబర్ బ్లాక్ చేశాడని చంపేసింది
Shocking: ఛత్తీస్గఢ్లో కేవలం ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడనే కోపంతో ఒక యువతి తన ప్రియుడిని కత్తితో పొడిచి హత్య చేయడం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనలో మృతుడిగా గుర్తించిన వ్యక్తి ప్రసాద్ సూర్యవంశీగా పోలీసులు వెల్లడించారు. ఇద్దరి మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం కొనసాగుతుండగా, ఇటీవలి కాలంలో ఏర్పడిన మనస్పర్థలే ఈ ఘోరానికి కారణమయ్యాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రసాద్ సూర్యవంశీ మరియు నిందితురాలైన యువతి మధ్య ప్రేమ సంబంధం ఉండేది. అయితే ఇటీవల ఇద్దరి మధ్య తరచుగా వాగ్వాదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రసాద్ ఆమె ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ తన...