Suicide: ‘అందంగా లేవు, మరోపెళ్లి చేసుకుంటా’ అని చెప్పిన భర్త.. భార్య ఏం చేసిందంటే?
Suicide: రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని కొత్తపల్లి మండలం రేకుర్తిలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భర్త వేధింపులు, నిరంతర అవమానాలు, అదనపు వరకట్నం కోసం చేసిన ఒత్తిడిని తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసింది. కుటుంబ కలహాలు, మద్యం వ్యసనం, వరకట్న డిమాండ్లు ఒక మహిళ ప్రాణాలకే కాదు.. ఆమె చిన్నారి జీవితానికీ ప్రమాదంగా మారడం ఈ ఘటనలో స్పష్టంగా కనిపిస్తోంది. కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన కోనేటి పోచయ్య కుమార్తె శిరీషారాణి అలియాస్ లహరి (33)కి కొత్తపల్లి మండలం రేకుర్తికి...