Violence: ఇలా తయారయ్యారేంట్రా బాబు.. భార్య అందంగా ఉందని కత్తితో గుండు గీసిన భర్త!

Violence: కర్ణాటకలోని బాగల్‌కోట జిల్లాలో చోటుచేసుకున్న ఒక అమానవీయ ఘటన సమాజాన్ని తీవ్రంగా కలచివేసింది. భార్య అందంగా ఉందన్న కారణంతో, ఆమెను ఇతర పురుషులు చూస్తున్నారన్న అనుమానంతో ఓ భర్త చేసిన దారుణం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. మానవ సంబంధాల్లో నమ్మకం, గౌరవం ఎంత అవసరమో గుర్తుచేస్తూ.. అనుమానం, మద్యం మత్తు కలిసి ఎలా హింసగా మారతాయో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాగల్‌కోట జిల్లాకు చెందిన ఉమేశ్ అనే వ్యక్తికి తన భార్యపై తీవ్రమైన అనుమానం ఏర్పడింది. ఆమె పొడవాటి జుట్టు వల్ల ఇతర యువకులు ఆకర్షితులవుతున్నారని, ఆమె అందం తనకు అవమానంగా మారుతోందన్న భావనతో అతడు...