Municipal Elections: వరంగల్లో ఊపందుకోనున్న ఎన్నికల ప్రచారం
Municipal Elections: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటి నుంచే పూర్తి స్థాయిలో ఊపందుకుంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీల నేతలు రంగంలోకి దిగడంతో జిల్లా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రతి పార్టీ తమ అభ్యర్థులను గెలిపించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఇంటింటి ప్రచారం, రోడ్ షోలు, బహిరంగ సభలకు సిద్ధమవుతోంది. ప్రజలను ఆకట్టుకునే హామీలు, స్థానిక సమస్యలపై హోరాహోరీ చర్చలతో ఈసారి ఎన్నికల ప్రచారం మరింత రసవత్తరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ తొలిసారి మున్సిపల్ బరిలోకి దిగడం రాజకీయంగా ప్రత్యేక ఆసక్తిని రేపుతోంది. ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దగా కనిపించని జనసేన.....