Meta, Whatsappకి సుప్రీంకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్‌

వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునే అంశంపై వాట్సాప్, మెటా సంస్థలకు సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. గోప్యతా హక్కులు రాజ్యాంగ పరిరక్షణలో ఉన్న మౌలిక హక్కులని స్పష్టం చేస్తూ, సాధారణ పౌరుల డేటాతో ఎవరూ ఆటలాడేందుకు వీల్లేదని కోర్టు తేల్చిచెప్పింది. టెక్ దిగ్గజాలు రూపొందించే గోప్యతా విధానాలు చాలా తెలివిగా, క్లిష్టంగా ఉండటం వల్ల సాధారణ వినియోగదారులు వాటి అసలు ప్రభావాలను అర్థం చేసుకోలేకపోతున్నారని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ కేసును విచారిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. వినియోగదారుల డేటాను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని స్పష్టమైన ఆదేశాలు...