Jaggery Tea: ఈ టిప్స్ పాటిస్తే చాలు.. బెల్లం టీ తయారు చేసేటప్పుడు పాలు పగలవు!

Jaggery Tea: ఉదయాన్నే వేడి వేడి టీ ఒక కప్పు చేతిలో పడితే రోజంతా అలసట తగ్గిపోయినట్టే అనిపిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఆవిరులు కక్కే టీ మనసుకూ, శరీరానికీ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. సాధారణంగా చాలామంది చక్కెర టీకి అలవాటు పడినా, ఆరోగ్యం మీద దృష్టి పెట్టే వారు మాత్రం బెల్లం టీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సహజమైన తీపి, మంచి రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు బెల్లం టీకి ప్రత్యేకతగా నిలుస్తున్నాయి. అయితే చాలా ఇళ్లలో బెల్లం టీ తయారు చేసే సమయంలో ఎదురయ్యే ప్రధాన సమస్య పాలు విరగడం. పాలు విడిపోవడంతో టీ రంగు మసకబారిపోతుంది, రుచి...