Post Office FD: ఈ స్కీమ్ చాలా బాగుంది కదా.. రూ.1 లక్ష ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చాలు.. ఆ తర్వాత
Post Office FD: భద్రమైన పెట్టుబడి మార్గం, స్థిరమైన ఆదాయం కోసం చూస్తున్న పెట్టుబడిదారులకు పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకం ఇప్పటికీ ఒక నమ్మకమైన ఆప్షన్‌గా కొనసాగుతోంది. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే పోస్టాఫీస్ FDల్లో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ హామీ ఉండటం వల్ల పెట్టుబడి చేసిన మొత్తం పూర్తిగా సురక్షితంగా ఉంటుందనే విశ్వాసం పెట్టుబడిదారుల్లో బలంగా ఉంది. అందుకే చిన్న సేవింగ్స్ నుంచి పెద్ద పెట్టుబడుల వరకు చాలా మంది ఈ పథకాన్ని ఎంచుకుంటున్నారు. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకం 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల కాలపరిమితుల్లో అందుబాటులో ఉంది. పెట్టుబడి వ్యవధిని...