Maruti Suzuki Alto: కారంటే ఇలా ఉండాలి.. తక్కువ ధరలో భద్రత, మైలేజ్, నమ్మకం..

Maruti Suzuki Alto: తక్కువ ధరలో భద్రత, మైలేజ్, నమ్మకాన్ని కలిపి ఒక ఫ్యామిలీ కార్ కావాలనుకునే వినియోగదారులకు మారుతి సుజుకి Alto K10 మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. భారతీయ ఆటో మార్కెట్లో చిన్న కార్ల విభాగంలో ఎన్నేళ్లుగా విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన Alto బ్రాండ్ ఇప్పుడు మరింత మెరుగైన భద్రతా ప్రమాణాలతో వినియోగదారుల ముందుకు వచ్చింది. మారుతి సుజుకి సంస్థ తాజాగా అన్ని Alto K10 వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తూ భద్రతకు పెద్దపీట వేసింది. ఇప్పటికే డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, స్పీడ్ అలర్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లతో మంచి పేరు తెచ్చుకున్న Alto.....