Tecno Spark Go 3: ఈ ఫోన్ భలే ఉంది.. కింద పడ్డ డ్యామేజ్ కాదట!.. ధర కూడా చాలా తక్కువే!
Tecno Spark Go 3: భారత్‌లో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో టెక్నో కంపెనీ మరో కొత్త బడ్జెట్ మోడల్‌తో మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. తాజాగా విడుదలైన Tecno Spark Go 3 తక్కువ ధరలోనే బలమైన ఫీచర్లు, మన్నికైన డిజైన్‌తో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా డ్రాప్ రెసిస్టెంట్ బాడీ, IP64 రేటింగ్ వంటి ఫీచర్లు ఈ ధర సెగ్మెంట్‌లో అరుదుగా కనిపిస్తాయి. సుమారు 1.6 మీటర్ల ఎత్తు నుంచి పడిపోయినా ఫోన్‌కు పెద్దగా నష్టం జరగకుండా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు టెక్నో వెల్లడించింది. రూ.8999 ధరలో ఇలాంటి భద్రతా ఫీచర్లు అందించడం కంపెనీకి ప్లస్ పాయింట్‌గా మారిందని టెక్ వర్గాలు...