NABARD: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్
NABARD: జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే ప్రతిష్టాత్మక ఆర్థిక సంస్థలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న నిరుద్యోగ యువతకు ఇది అరుదైన అవకాశంగా మారింది. మొత్తం 162 ఖాళీలను భర్తీ చేయనున్న ఈ ప్రకటనలో డెవలప్‌మెంట్ అసిస్టెంట్ విభాగానికి 159 పోస్టులు, డెవలప్‌మెంట్ అసిస్టెంట్ (హిందీ) విభాగానికి 3 పోస్టులను కేటాయించారు. స్థిరమైన ఉద్యోగం, ఆకర్షణీయమైన వేతనం, భవిష్యత్తు భద్రత కోరుకునే అభ్యర్థులకు నాబార్డ్ ఉద్యోగాలు ఎప్పటికీ ప్రాధాన్యతగా నిలుస్తున్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 3, 2026 లోపు ఆన్‌లైన్ విధానంలో...