Suicide: అయ్యో తల్లి.. అమ్మ కోసం ఆలోచించి ఎంత పని చేశావమ్మ!

Suicide: తన పెండ్లి తర్వాత తల్లిని చూసుకునే వారు ఉండరనే ఆందోళనతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. చదువుతో, మంచి ఉద్యోగంతో జీవితం ముందుకు సాగాల్సిన వయసులోనే మానసిక భారాన్ని మోయలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. ఆదివారం హుస్సేన్ సాగర్‌లో దూకి ప్రాణాలు తీసుకున్న యువతిని పోలీసులు సోమవారం గుర్తించి, ఘటనకు సంబంధించిన వివరాలను వెలుగులోకి తెచ్చారు. లేక్ ఇన్‌స్పెక్టర్ ఆర్.వెంకటేశ్వర్లు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బైంసాకు చెందిన విజయలక్ష్మి (26) తన తండ్రి మరణం తర్వాత తల్లితో కలిసి కూకట్‌పల్లిలోని మోతి నగర్‌లో అద్దెకు నివసిస్తోంది. ఓ ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ...