LPG cylinder: గ్యాస్ సిలిండర్ వాడే వారికి గుడ్‌న్యూస్.. రూ.300 కడితే చాలు!..

LPG cylinder: ఎన్నాళ్లుగానో భారతీయ వంటింట్లో గ్యాస్ సిలిండర్ అంటే బరువైన ఎర్రటి ఇనుప బండే గుర్తుకు వస్తుంది. దాన్ని కదిలించాలన్నా, మార్చాలన్నా మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిందే. బరువు సమస్యతో పాటు తుప్పు పట్టడం, భద్రతపై భయం కూడా చాలా కాలంగా వినియోగదారులను వెంటాడుతోంది. ముఖ్యంగా ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఇనుప సిలిండర్లు పేలిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన చాలామందిలో ఉంది. ఈ నేపథ్యంలో ఎల్‌పీజీ వినియోగదారులకు ఊరటనిచ్చేలా గ్యాస్ సిలిండర్లలోనే విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంది. సంప్రదాయ స్టీల్ గ్యాస్ సిలిండర్లకు పూర్తిగా ప్రత్యామ్నాయంగా ఆధునిక సాంకేతికతతో రూపొందించిన కొత్త ‘లైట్’ సిలిండర్ ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చింది. వంటింట్లో రోజూ ఎదురయ్యే...