Wardhannapet: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మానిఫెస్టో విడుదల
Wardhannapet: వర్ధన్నపేటలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సోమవారం బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, రాజేశ్వరరావు, కొండేటి శ్రీధర్తో పాటు బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో వర్ధన్నపేట మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వర్ధన్నపేటలో కాషాయ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయాన్ని సాధించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన...