Recipes: బీరకాయ కర్రీలో కొంచెం కొత్తదనం కావాలా?.. అయితే కొంచెం పెరుగు కలపండి అదిరిపోద్ది!

Recipes: తెలుగు రాష్ట్రాల వంటగదుల్లో బీరకాయకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కూరగా, బజ్జీగా, పచ్చడిగా ఎన్నో రూపాల్లో బీరకాయ మన నిత్యాహారంలో చోటు దక్కించుకుంటుంది. అయితే రోజూ ఒకే రకమైన బీరకాయ కూర తినడంతో కొంతకాలానికి రుచి బోర్ కొట్టడం సహజమే. అలాంటి సమయంలో భోజనంలో కాస్త కొత్తదనం కావాలంటే పెరుగు, బీరకాయ కర్రీ మంచి ఎంపికగా నిలుస్తుంది. సాధారణ బీరకాయ కూరకు పెరుగు కలవడంతో ఈ వంటకం క్రీమీనెస్‌తో పాటు మృదువైన టెక్స్చర్‌ను అందిస్తుంది. స్వల్ప పులుపు రుచి ఉండటంతో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలా ఉంటుంది. బీరకాయ రుచికరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో...