Bank Holidays: ఫిబ్రవరిలో బ్యాంక్ హాలిడేస్ ఫుల్ లీస్ట్ ఇదిగో..

Bank Holidays: 2026 జనవరి నెల ముగిసిన నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు సంబంధించిన సెలవులపై స్పష్టత వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి నెలకు సంబంధించిన బ్యాంక్ హాలిడే లిస్ట్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు కొన్ని సెలవులు వర్తించనున్నాయి. అయితే అన్ని సెలవులు దేశవ్యాప్తంగా కాకుండా కొన్ని రాష్ట్రాలు, నగరాలకు మాత్రమే పరిమితమయ్యే సెలవులుగా ఉండనున్నాయి. బ్యాంకింగ్ సేవలపై ఆధారపడే వినియోగదారులు ఈ సెలవుల వివరాలను ముందుగానే తెలుసుకుని తమ ఆర్థిక లావాదేవీలను సక్రమంగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని బ్యాంకింగ్ వర్గాలు...