Home Remedies: మీ ఇంట్లో ఈగలు, దోమలు, బొద్దింకలు బాగా ఉన్నాయా..? ఏం చింతించకండి.. ఒక్క కర్పూరం చాలు!
Home Remedies: ఇంట్లో ఈగలు, దోమలు, బొద్దింకల బెడదతో చాలామంది నిత్యం ఇబ్బంది పడుతుంటారు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకున్నా ఈ కీటకాలు ఎక్కడో ఒక మూల నుంచి లోపలికి చొరబడుతూనే ఉంటాయి. ముఖ్యంగా వంటగది, బాత్రూమ్, ఇంటి మూలలు, తలుపులు, కిటికీల దగ్గర ఇవి ఎక్కువగా కనిపిస్తూ అసహనం కలిగిస్తాయి. ఇవి కేవలం చిరాకు మాత్రమే కాదు.. ఇంటి వాతావరణాన్ని కలుషితం చేయడమే కాకుండా ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలామంది మార్కెట్లో లభించే రసాయన స్ప్రేలు పురుగుమందులు వాడుతుంటారు. కానీ అవి చిన్న పిల్లలు, పెంపుడు జంతువులకు హానికరంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే రసాయనాల...