Arrest: ఏసీబీ వలలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్
Arrest: తెలంగాణలో మరో లంచగొండితన ఘటన కలకలం రేపింది. గుర్రంపోడ్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏసీబీ వలలో చిక్కుకున్నారు. బాధితుడి నుంచి లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటంతో రెవెన్యూ శాఖలో చర్చ మొదలైంది. బాధ్యత గల అధికారిగా ఉండి కూడా అక్రమంగా వ్యవహరించడంపై ఏసీబీ అధికారులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనతో ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల వ్యవహారం మరోసారి బహిర్గతమైంది. ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంట సమయంలో గుర్రంపోడ్ మండలంలోని ఎంఆర్వో కార్యాలయ ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సదరు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ హకీం లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు....