Phone tapping case: కేసీఆర్ అనుమానితుడా?.. నిందితుడా?

Phone tapping case: గత రెండు వారాలుగా తెలంగాణ రాజకీయ వాతావరణం మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసు చుట్టూనే తిరుగుతోంది. ఒకప్పుడు నెమ్మదిగా సాగిందన్న విమర్శలు ఎదుర్కొన్న ఈ కేసు దర్యాప్తు ఇప్పుడు ఒక్కసారిగా ఊపందుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సంచలనంగా మారిన ఈ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం వేగం పెంచింది. ఇప్పటికే బీఆర్ఎస్‌లో కీలక నేతలు, ఉన్నతాధికారులను విచారించిన సిట్.. ఆదివారం గులాబీ బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దాదాపు నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. కేసీఆర్ విచారణ పూర్తవడంతో ఈ కేసులో తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై సర్వత్రా చర్చ మొదలైంది. ఇప్పటివరకు...