BSNL free offer: ప్రైవేట్ కంపెనీలకు చుక్కలే!
BSNL free offer: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL మరోసారి సంచలన నిర్ణయంతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ప్రైవేట్ టెలికాం కంపెనీలకు దీటుగా తక్కువ ధరలో మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే పలు ఆకర్షణీయమైన ప్లాన్లను ప్రవేశపెట్టిన BSNL.. ఇప్పుడు వినియోగదారులను ఆకట్టుకునే క్రేజీ ఆఫర్ను ప్రకటించింది. పాత నెట్వర్క్ను వినియోగిస్తున్న కస్టమర్లను ఆధునిక 4G సేవల వైపు తీసుకురావాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉచిత 4G సిమ్ కార్డులను అందించడం ప్రారంభించింది. ఈ నిర్ణయం టెలికాం రంగంలో మరో కీలక మలుపుగా మారుతోంది. పాత నెట్వర్క్ నుంచి 4Gకి మారే వినియోగదారులకు ఈ ఫ్రీ ఆఫర్ వర్తిస్తుందని BSNL స్పష్టం చేసింది. కొత్త...