FISH: మీరు చేపలను కడగడానికి చింతపండు, పసుపు, ఉప్పు వాడతారా?
FISH: చాలా ఇళ్లలో ఆదివారం వచ్చిందంటే నాన్ వెజ్ వంటకాల సందడి మొదలవుతుంది. చికెన్ మటన్‌తో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చేపలను వండుకుని తినేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. పోషక విలువలు అధికంగా ఉండటంతో ఆహార నిపుణులు కూడా చేపలను నిత్యాహారంలో తప్పకుండా చేర్చుకోవాలని సూచిస్తుంటారు. అయితే చేపలను వండే ముందు దాదాపు ప్రతి ఇంట్లో ఒకే విధమైన శుభ్రపరిచే పద్ధతి కనిపిస్తుంది. చింతపండు, పసుపు, ఉప్పుతో చేపలను శుభ్రం చేయడం చాలా మందికి అలవాటుగా మారింది. ఇది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు దీనికి వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చేపలు సముద్రం లేదా...