Shocking Murder: భర్త గొంతుకోసి చంపి.. వెంటిలేటర్ గ్రిల్‌కు వేలాడదీసి!
Shocking Murder: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. తొమ్మిదేళ్ల పాటు ప్రేమించుకున్న జంట చివరకు కుటుంబసభ్యుల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టినా, పెళ్లయిన రెండు నెలలకే ఆ ప్రేమ రక్తపాతం అయ్యింది. భర్తను భార్యే కిరాతకంగా హత్య చేయడం, ఆ తర్వాత ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం కలకలం రేపుతోంది. ప్రేమ, పెళ్లి, కుటుంబం అన్న బంధాలన్నింటినీ మంటగలిపేలా చేసిన ఈ ఘటన వెనుక అసలు కథ పోలీసు విచారణలో వెలుగులోకి వచ్చింది. జితేంద్ర కుమార్ యాదవ్, జ్యోతి అనే యువతీ యువకులు తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇరువురి ప్రేమకు కుటుంబ...