Phone Tapping: సిట్ విచారణ.. కేసీఆర్‌ని అడిగిన ప్రశ్నలివే!

Phone Tapping: తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం సుదీర్ఘంగా విచారించింది. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నందినగర్‌లోని ఆయన నివాసంలో ప్రారంభమైన ఈ విచారణ 4 గంటలకుపైగా కొనసాగినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం వరకు సాగిన ఈ విచారణలో సిట్ అధికారులు కేసుకు సంబంధించిన కీలక అంశాలపై వరుసగా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. నందినగర్ నివాసంలోనే ఆరుగురు సభ్యులతో కూడిన సిట్ బృందం కేసీఆర్‌ను విచారించింది. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా మారిన సాక్షుల వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాల...