Violence: 40 గంటలు.. 193 మంది మృతి
Violence: పాకిస్థాన్‌లోని అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్థాన్ మరోసారి తీవ్ర హింసతో అట్టుడుకుతోంది. గత 40 గంటలుగా కొనసాగిన ఘర్షణలు ఆ ప్రాంతాన్ని యుద్ధభూమిని తలపించేలా మార్చేశాయి. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ రెబల్స్, పాకిస్థాన్ భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ ఘర్షణల్లో మొత్తం 193 మంది మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో అత్యధికంగా 145 మంది రెబల్స్ ఉండగా, 17 మంది పోలీస్ సిబ్బంది, 31 మంది నిరపరాధ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా క్వెట్టా నగరాన్ని కేంద్రంగా చేసుకుని బలూచిస్థాన్‌లోని కనీసం 12 ప్రాంతాల్లో ఒకేసారి ఘర్షణలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో...