Under-19 WC: పాకిస్థాన్ ఔట్.. సెమీఫైనల్లోకి భారత్

అండర్- 19 ప్రపంచకప్‌లో భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆదివారం జరిగిన సూపర్ 6 కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ అండర్- 19 జట్టును ఘనంగా ఓడించిన భారత జట్టు, టోర్నీలో అజేయంగా దూసుకెళ్లుతూ సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. హైటెన్షన్ మ్యాచ్‌గా భావించిన ఈ పోరులో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచి ప్రత్యర్థిని పూర్తిగా నియంత్రించారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ సమతూకంతో ఆడిన టీమిండియా 58 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత అండర్- 19 జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 49.5 ఓవర్లకే 252 పరుగులకు ఆలౌటైంది. ఆరంభంలోనే కీలక...