మొండ్రాయి ZPHSలో పూర్వ విద్యార్థుల సందడి

2000- 2001 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న విద్యార్థులు గురువుల సేవలకు కృతజ్ఞతలు గురువులకు ఘన సత్కారం అపూర్వ అనుభూతిని మిగిల్చిన సమ్మేళనం స్టార్ త్రినేత్రం, వరంగల్:  సంగెం మండలం మొండ్రాయి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరోసారి పూర్వ విద్యార్థుల సందడితో కళకళలాడింది. 2000-2001 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పాఠశాల ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఎన్నో ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థులు తమ విద్యాభ్యాస కాలాన్ని, చిన్ననాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగంగా మారారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబ బాధ్యతలతో బిజీగా గడుస్తున్న జీవితాల నుంచి ఒక్కరోజు...