Budget 2026: పెరిగేవి.. తగ్గేవి ఇవే..

Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పన్నులు, కస్టమ్స్ డ్యూటీలు, టీసీఎస్, టిడిఎస్‌లో చేసిన మార్పుల కారణంగా కొన్ని వస్తువులు, సేవల ధరలు తగ్గే అవకాశం ఉండగా.. మరికొన్ని వస్తువుల ధరలు మాత్రం పెరగనున్నాయి. దీంతో బడ్జెట్ ఎఫెక్ట్‌గా మార్కెట్‌లో వినియోగదారులపై పడే భారం ఎటువైపు ఉంటుందనే అంశంపై చర్చ మొదలైంది. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా అనేక రంగాల్లో పన్ను భారాన్ని తగ్గించింది. విదేశీ ప్రయాణాలు, విదేశీ విద్య, ఆరోగ్య రంగం, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి రంగాల్లో తీసుకున్న నిర్ణయాలు సామాన్యులకు లాభం చేకూర్చేలా ఉన్నాయి....