EV Range Tips: ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కువ దూరం వెళ్లాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి!
EV Range Tips: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకీ వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు సాధారణ ప్రజల దైనందిన జీవితంలో భాగమయ్యాయి. ఆఫీస్కు రోజూ వెళ్లే ఉద్యోగులు మొదలుకొని కాలేజీ విద్యార్థులు, డెలివరీ బాయ్స్ వరకు చాలామంది ఇంధన ఖర్చులు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో, కాలుష్యరహిత ప్రయాణాల కోసం ఈ-స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్న పరిస్థితుల్లో, తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయాలనుకునే వారికి ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి ప్రత్యామ్నాయంగా మారాయి. అయితే, ఈ స్కూటర్లను వాడే చాలా మందికి ఎదురయ్యే ప్రధాన సమస్య మాత్రం ‘రేంజ్’. ఒకసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం వెళ్తుంది? మధ్యలో ఛార్జ్...