Epstein Files: అమ్మాయిలతో శృంగారం చేయడం వల్ల వ్యాధి బారిన పడ్డ బిల్ గేట్స్?
Epstein Files: అమెరికాలో ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్ స్టీన్‌కు సంబంధించిన సెక్స్ కుంభకోణం మరోసారి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ కేసుకు సంబంధించి సుమారు 30 లక్షల పేజీల దర్యాప్తు పత్రాలను అమెరికా న్యాయశాఖ తాజాగా బహిర్గతం చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విడుదలైన ఎప్ స్టీన్ ఫైల్స్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వంటి ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తుల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అయితే ఫైల్స్‌లో పేర్లు ఉన్నాయన్న కారణంతోనే వారు తప్పు చేశారని అర్థం కాదని న్యాయశాఖ...