Shocking: ఇద్దరిని పెళ్లి చేసుకుని.. మూడో వ్యక్తితో మహిళ పరార్!
Shocking: కర్ణాటకలో చోటుచేసుకున్న ఓ షాకింగ్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఒకే మహిళ ఇద్దరు వ్యక్తులను పెళ్లి చేసుకుని, చివరికి మూడో వ్యక్తితో పరారైన ఘటన దొడ్డబళ్లాపుర పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఒకేసారి ఇద్దరు వ్యక్తులు తమ భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కథ బయటపడింది. పోలీసులకే ఆశ్చర్యం కలిగించిన ఈ ఘటనలో విచారణ సాగేకొద్దీ సంచలన నిజాలు వెలుగుచూశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుధారాణి అనే మహిళ మొదట వీరేగౌడ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మొదట కుటుంబ జీవితం...