Bhatti Vikramarka: ప్రపంచ దేశాలతో పోటి పడే విధంగా తెలంగాణ ఎదగాలి

Bhatti Vikramarka: ప్రపంచ దేశాలతో అన్ని రంగాల్లో పోటీ పడే స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవ వేడుకలకు శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే విద్య, వైద్యం, ఉపాధి రంగాలే పునాదులని పేర్కొన్నారు. అందుకే ఈ మూడు రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.22 వేల 500 కోట్లతో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామని...