Harvard University: లీడర్షిప్ కోర్సు పూర్తి చేసిన సీఎం రేవంత్
Harvard University: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్షిప్ కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీలోని ప్రతిష్టాత్మక కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో పాల్గొని సర్టిఫికెట్ను అందుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ కోర్సును పూర్తి చేయడం ద్వారా సీఎం రేవంత్రెడ్డి మరో మైలురాయిని సాధించినట్లుగా భావిస్తున్నారు. ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు ‘లీడర్షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ పేరిట ఈ కోర్సును నిర్వహించారు. ఆధునిక పాలన, నాయకత్వ నైపుణ్యాలు, నిర్ణయాల సామర్థ్యం వంటి అంశాలపై ఈ తరగతుల్లో విశ్లేషణాత్మకంగా చర్చ జరిగింది. భవిష్యత్...