నదీ జల వివాదాలపై కేంద్ర జల వివాదాల కమిటీ సమావేశం
తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నదీ జల వివాదాలపై కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ కీలక సమావేశం శుక్రవారం జరిగింది. ఢిల్లీలోని కేంద్ర జలసంఘం కార్యాలయంలో జరిగిన ఈ భేటీ దాదాపు 2 గంటల పాటు సాగింది. కేంద్ర జలసంఘం ఛైర్మన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి జలవనరుల రంగానికి చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. కృష్ణా, గోదావరి నదులపై నెలకొన్న వివాదాలకు పరిష్కార మార్గాలు అన్వేషించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశంగా కొనసాగింది. ఈ సమావేశంలో కేంద్ర జలసంఘం అధికారులు, కృష్ణా నది యాజమాన్య మండలి, గోదావరి నది యాజమాన్య మండలి ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే నేషనల్ వాటర్ డెవలప్ మెంట్ ఏజెన్సీ ఛైర్మన్,...