సమ్మక్క- సారలమ్మలను దర్శించుకున్న గవర్నర్
స్టార్ త్రినేత్రం, వరంగల్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ శుక్రవారం మేడారం వనదేవతలు సమ్మక్క సారలమ్మలను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గద్దెలపై కొలువైన వనదేవతలకు నైవేద్యాలు సమర్పించి భక్తితో ప్రార్థనలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందరికీ దేవతల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. మేడారం వాతావరణం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. సమ్మక్క సారలమ్మలు ప్రజల కష్టాలను తొలగించే శక్తిమంతమైన వనదేవతలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం శాంతి సమృద్ధులతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం దేవతల కృప అవసరమని తెలిపారు. రైతులు, కార్మికులు,...