మహిళల ముందు తలెత్తుకోలేకపోతున్నాం.. మా ఊరిపేరు మార్చండయ్యా!

ఏ గ్రామానికైనా ఆ ఊరి పేరు అక్కడి ప్రజలకు గుర్తింపు, గర్వానికి ప్రతీక. కానీ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండల పరిధిలోని ఒక కుగ్రామానికి మాత్రం అదే పేరు తీవ్ర అవమానంగా మారింది. రెవెన్యూ రికార్డుల్లో ఆ గ్రామానికి అసభ్యార్థం వచ్చేలా ఉన్న పాత పేరు కొనసాగుతుండటంతో అక్కడ నివసిస్తున్న సుమారు 150 కుటుంబాలు ఎన్నేళ్లుగా మానసిక వేదనను అనుభవిస్తున్నాయి. ఊరి పేరు పలికే సందర్భం వచ్చిన ప్రతీసారి వారు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వంజీరి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ గ్రామం పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవించే సామాన్య ప్రజల నివాసం. కాగజ్‌నగర్ పట్టణానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో...