History: తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక ‘మేడారం’
History: తెలంగాణ గిరిజన చరిత్రలో, ప్రజా పోరాటాల వారసత్వంలో సమ్మక్క- సారలమ్మలు కేవలం దేవతలుగా మాత్రమే కాదు.. అణచివేతకు వ్యతిరేకంగా ఆయుధం ఎత్తిన వీరోచిత వనితలుగా నిలిచిపోయారు. కాకతీయుల సైన్యాన్ని గడగడలాడించిన ధైర్యవంతులైన ఈ తల్లి- కుమార్తె కథే నేటికీ మేడారం మహాజాతర రూపంలో జీవంతంగా కొనసాగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా గుర్తింపు పొందిన ఈ జాతర, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని దట్టమైన అడవులు, కొండకోనల మధ్య ఉన్న మేడారం గ్రామంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క- సారలమ్మ జాతరకు దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారు. కుంభమేళా తర్వాత భారతదేశంలో అత్యధిక జనసందోహం ఏర్పడే...