Mahesh Kumar Goud: ఎవరికైనా నోటీసులు ఇచ్చే అధికారం సిట్‌కు ఉంది
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిజాలు తేలాలి కేసీఆర్‌కు సిట్ నోటీసులపై మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు Mahesh Kumar Goud: తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. నంది నగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు స్వయంగా నోటీసులు అందజేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ వయస్సు, ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని ఆయన కోరిన ప్రదేశంలోనే విచారణ చేపడతామని సిట్ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ మరింత లోతుగా సాగుతున్న...