SIT Notices: ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులపై హరీశ్ రావు స్పందన

‘ఎక్స్’ వేదికగా ఘాటైన ట్వీట్ సిట్ పేరుతో రాజకీయ వేధింపులు కేసీఆర్ వెంటే తెలంగాణ సమాజం SIT Notices: ఉద్యమ నేతను టచ్ చేయడం అంటే తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ‘ఎక్స్’ వేదికగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాతి పితగా కోట్లాది మంది ప్రజల మనసుల్లో నిలిచిన గౌరవనీయుడు కేసీఆర్‌పై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుతంత్రాలు సాగిస్తోందని ఆయన విమర్శించారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, పదేళ్ల పాలనలో తెలంగాణను...