Mulkanur Jatara: అమ్మవార్లను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్

Mulkanur Jatara: భీమదేవరపల్లి మండలం ములకనూరు గ్రామంలో నిర్వహిస్తున్న సమ్మక్క-సారలమ్మ జాతర భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతోంది. ఈ జాతరలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లులకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకోవడంతో పాటు, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. జాతర ప్రాంగణంలో భక్తుల సందడి, ఆధ్యాత్మిక వాతావరణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ములకనూరు సమ్మక్క-సారలమ్మ జాతరను స్థానిక నాయకులు, గ్రామస్తులు, భక్తులు అందరూ కలిసికట్టుగా ఘనంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ జాతర ప్రజల విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. అమ్మవార్ల గద్దెలకు...