Telangana: మేడిగడ్డ బ్యారేజీపై కేంద్రం రెడ్ అలర్ట్
కేటగిరీ 1 ప్రమాదకర డ్యామ్గా గుర్తింపు పోస్ట్ మాన్సూన్ తనిఖీల్లో బయటపడ్డ లోపాలు Telangana: మేడిగడ్డ బ్యారేజీ అంశం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. మేడిగడ్డ ప్రాజెక్టును అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న డ్యామ్గా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేయడం సంచలనంగా మారింది. 2025 పోస్ట్ మాన్సూన్ తనిఖీల్లో భాగంగా కేంద్ర నిపుణుల బృందం నిర్వహించిన సమగ్ర పరిశీలనలో మేడిగడ్డ బ్యారేజీలో అనేక కీలక లోపాలు ఉన్నట్లు తేలింది. ఈ లోపాలను వెంటనే సరిచేయకపోతే భవిష్యత్తులో తీవ్రమైన ప్రమాదం సంభవించే అవకాశముందని కేంద్రం స్పష్టంగా హెచ్చరించింది. డ్యామ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం మేడిగడ్డను కేటగిరీ 1 ప్రమాదకర డ్యామ్గా గుర్తించడం ప్రాజెక్టు...