Ponguleti Srinivas Reddy: దక్షిణ భారత కుంభమేళాగా ‘మేడారం’

రికార్డు స్థాయిలో భక్తుల తాకిడి ఒక్కరోజులోనే 80 లక్షల మంది దర్శనం కోటికి చేరనున్న భక్తుల సంఖ్య భక్తుల సౌకర్యాలపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి భవిష్యత్తులో ఒక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ‘మేడారం’ : మంత్రులు పొంగులేటి, సీతక్క తెలంగాణ కుంభమేళాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో భక్తుల తాకిడి గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. గురువారం మేడారంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒక్కరోజులోనే సుమారు 80 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని, సమ్మక్క గద్దెపైకి అమ్మవారు వచ్చే సమయానికి ఈ సంఖ్య...