Mallu Bhatti Vikramarka: అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని త్యాగం చేయం

Mallu Bhatti Vikramarka: పరిశుభ్రమైన గాలితోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకోసం తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలనే దృఢ సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని త్యాగం చేయబోమని, అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండూ చేతులు కలిపి నడవాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి విభాగంలో గాలి నాణ్యత సూచీ, గాలి నాణ్యత...