VHP: రేపు, ఎల్లుండి సెలవులు ఇవ్వాలని డిమాండ్

VHP: మేడారం మహాజాతర నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సెలవుల అంశం మరోసారి చర్చకు వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు అధికారిక సెలవులు ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జాతర ప్రధాన రోజులు అయిన ఈ నెల 30, 31 తేదీలకు రెండు రోజులు సెలవులు ఇవ్వాలని స్పష్టం చేసింది. మేడారంలోనే క్యాబినెట్ భేటి నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పటికీ సెలవులపై ప్రకటన ఎందుకు చేయడం లేదని వీహెచ్‌పీ ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా మేడారం జాతరను ప్రపంచ స్థాయి వేడుకగా ప్రచారం చేస్తూ, ఆ స్థాయికి తగిన గుర్తింపు మాత్రం...