Inspiration: భార్యాభర్తలకు ఒకేసారి గ్రూప్-2 ఉద్యోగాలు
జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా పట్టుదలతో ముందుకు సాగితే విజయం తప్పక వరిస్తుందనడానికి ఏపీపీఎస్సీ గ్రూప్-2 తుది ఎంపిక జాబితా నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది యువతకు ఈ ఫలితాలు ఆశను, ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అనేక మంది సక్సెస్ స్టోరీలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అనంతపురం జిల్లా గన్నెవారిపల్లికి చెందిన హేమచంద్ర, వినత దంపతుల విజయం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇద్దరూ సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు చేస్తూనే గ్రూప్-2 పరీక్షలకు సిద్ధమయ్యారు. ఉద్యోగ భారం, కుటుంబ బాధ్యతల మధ్య సమయాన్ని సద్వినియోగం చేసుకుని చదువుపై పూర్తిగా దృష్టి పెట్టారు. వారి కృషికి ఫలితంగా...