Andhra Pradesh: ఇల్లు లేనివారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 2.61 లక్షల ఇళ్లను జూన్ నెలాఖరులోపు పూర్తిచేసి అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలని స్పష్టమైన లక్ష్యాన్ని నిర్ధేశించింది. పేదల సొంతింటి కలను త్వరగా నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ భారీ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన ఆర్థిక వనరులపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి పనుల కోసం ఏపీ టిడ్కో ద్వారా హడ్కో నుంచి తీసుకోనున్న రూ.4,451 కోట్ల రుణానికి రాష్ట్ర ప్రభుత్వ హామీ ఇవ్వాలని మంత్రివర్గం ఆమోదం తెలిపింది....