Indigo: విమానాన్ని ఢీకొట్టిన పక్షి
Indigo: ఇటీవల విమానయాన రంగంలో పక్షుల తాకిడి ఘటనలు తరచుగా వెలుగుచూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గాల్లో ప్రయాణిస్తున్న విమానాలను పక్షులు ఢీకొట్టడం వల్ల ప్రయాణికుల్లో ఒక్కసారిగా భయం నెలకొంటోంది. ముఖ్యంగా టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఈ తరహా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటంతో భద్రతాపరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి ఘటన ఒకటి తాజాగా హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. గోవా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వస్తున్న ఇండిగో విమానాన్ని గాల్లో ఉండగానే ఓ పక్షి ఢీకొట్టింది. ఈ విషయం గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశాడు. పక్షి ఢీకొట్టిన విషయాన్ని పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు తెలియజేశాడు. సమాచారం...