PM Kisan: 30 లక్షల మంది రైతుల పేర్లు తొలగింపు.. లిస్ట్‌లో పేరు చెక్ చేసుకోండిలా!

PM Kisan: రైతులకు మరో కీలక అలర్ట్‌ వచ్చింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వచ్చే రూ.2 వేల విడత కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్నారు. రాబోయే ఫిబ్రవరి నెలలోనే ఈ నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒక చిన్న తప్పు చేస్తే మాత్రం ఈ సాయం మీకు అందకుండా ఆగిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రతి రైతు తప్పనిసరిగా కొన్ని విషయాలను ముందే తనిఖీ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పీఎం కిసాన్ 22వ విడత నిధులకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ 2026 కేంద్ర బడ్జెట్ పూర్తయ్యాక, ఫిబ్రవరి...