AI effect: అమెజాన్‌లో భారీగా ఉద్యోగాల కోత

AI effect: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు తెరలేపింది. ఇప్పటికే 2025 చివరి నాటికి దాదాపు 14 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన సంస్థ.. తాజాగా ప్రపంచవ్యాప్తంగా మరో 16 వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం గ్లోబల్ టెక్ రంగంలో మరోసారి కలకలం రేపుతోంది. కరోనా కాలంలో భారీగా నియామకాలు చేపట్టిన అమెజాన్, ఇప్పుడు వ్యాపార వ్యయాలను తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలపై ఎక్కువగా ఆధారపడాలని సంస్థ భావిస్తున్న నేపథ్యంలో మానవ వనరుల అవసరం తగ్గుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మార్పులు ఉద్యోగులపై ప్రత్యక్ష...