కొత్త బార్ లైసెన్సుకు నోటిఫికేషన్.. ఫిబ్రవరి 4 వరకు దరఖాస్తుల గడువు
పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా ఒక బార్ లైసెన్సు మంజూరుకు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటనతో నర్సాపురం ప్రాంతంలో వ్యాపార వర్గాల్లో ఆసక్తి పెరిగింది. మద్యం వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది కీలక అవకాశంగా మారింది. ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం నర్సాపురం మున్సిపాలిటీలో డబ్ల్య్ జి బి 10 వరుస సంఖ్యకు చెందిన బార్ లైసెన్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 4 2026 సాయంత్రం 6 గంటల లోపు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా...