IPL 2028లో ఆడనున్న ధోనీ.. సంబరాలు చేసుకుంటున్న అభిమనులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అభిమానులకు సూపర్ సర్‌ప్రైజ్‌లా మారిన వార్త ఒకటి ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. లెజెండరీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌లో 2028 వరకూ కొనసాగనున్నాడన్న ప్రచారం అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఈ అంశంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోయినా.. ఈ వార్తతో సీఎస్‌కే ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ధోనీ ఐపీఎల్ నుంచి ఎప్పుడు రిటైర్ అవుతాడన్న ప్రశ్న గత కొన్ని ఏళ్లుగా అభిమానులను వెంటాడుతూనే ఉంది. ప్రతి సీజన్ ముగిసిన తర్వాత ఇదే చర్చ మళ్లీ మొదలవుతుంది. అయితే ఇప్పుడు కనీసం నాలుగేళ్ల పాటు ధోనీని మైదానంలో చూడొచ్చన్న సంకేతాలు...